Friday, 13 September 2013

Malini 22

Malini 22, A movie with a social consciousness, A Movie with a Dignity and Responsibility ; 

Screenplay and Direction by : SRIPRIYA RAJKUMAR; Music by ANAND - SHANKAR ; Dialogues by: UMARJEE ANURADHA & GAUTHAM KASHYAP (Kavuri Sridhar Kumar); Lyrics : ANANTH SRIRAM; Editor: BHAVAN SRI KUMAR; Art Director :PREM NAVAZ; Cinemtography by MANOJ PILLAI ; Costumes : ANUPARTHASARATHI;  Makeup: SALIM NAGARKOIL; Stills: LAKSHMI KANTHAN; PRO: B.A. RAJU - Executive Producers : SURESH BALAJI AND GEORGE PIUS - WIDE ANGLE CREATIONS; 

               రాజ్ కుమార్ థియేటర్స్ ప్రైవేట్ లిమిటెడ్

Rajkumar Theatres Pvt. Ltd

Welcome to allరాజ కుమార్ థియేటర్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న తెలుగు చిత్రం “మాలిని, 22 ”. ఈ చిత్రం షూటింగ్ జులై 2013 న మొదలై 80% శాతం పూర్తి చేసుకుంది.
“ ఈ పపంచంలో అత్యంత విచారకరమైన అంశం ఏమిటంటే నీచులు ప్రదర్శించే కౄరత్వం, అధికారం,  కాదు   మంచి వాళ్లు వాళ్ళ పట్ల వహించే మౌనం ” – మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్.  మాలిని , 22,”  చిత్రానికి దర్శకత్వం వహిస్తున్న శ్రీ ప్రియ రాజ్ కుమార్, “అంతులేని కధ”,  “చిలకమ్మ చెప్పింది, పొట్టేలు పున్నమ్మ’ వంటి అనేక విజయవంతమైన చిత్రాలతో దక్షిణ భారత చలన చిత్ర సీమలో హీరోయిన్ గా సుమారు 200 చిత్రాలకు పైగా నటించారు.   ప్రేక్షకులను అలరించిన అలనాటి ఈ ప్రముఖ హీరోయిన్.  దర్శకురాలిగా రచయితగా కూడా “విడుదలై”   “మరక్క ముడియుమా...?”  వంటి ఎంతో సున్నితమైన విప్లవాత్మకమైన టెలివిజన్ సీరియల్స్ ని  సమర్పించారు.
ఈమె మరొక విన్నూత్నమైన చలన చిత్రానికి శ్రీకారం చుట్టి, ప్రేక్షకుల ముందుకు రానున్నారు.  ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న నిర్మాత ప్రముఖ పారిశ్రామిక వేత్త  “రాజకుమార్ సేతుపతి” 60 కి పైగా చలన చిత్రాలలో నటించిన నటులే కాక నిండైన మానవత్వం కలిగిన మనిషి కూడా. ఈయన ఈ చిత్రంతో ఆయన నిర్మాతగా ముందుకొస్తున్నారు.     
ఈ చిత్రానికి పనిచేస్తున్న ప్రముఖ సాంకేతిక నిపుణులు

డైరెక్టర్ ఆఫ్ ఫొటోగ్రఫీ : మనోజ్ పిళ్ళై  సంతోష్ శివన్ స్కూల్ నుంచి వచ్చిన ఈయన, 19 చిత్రాలకు కెమేరామెన్ గా పని చేశారు.
ఎడిటర్ : భవన్ శ్రీ కుమార్,  ప్రముఖ ఎడిటర్ శ్రీకర్ ప్రసాద్ దగ్గర పనిచేశారు.సంగీతం : అరవింద్ - శంకర్, ; ఈసంగీత దర్శకులు  ఇష్క్ 2012 చిత్రానికి సంగీతం అందించారు.
మాటలు : అనూరాధ ఉమర్జీ ‌& గౌతమ్ కశ్యప్.   2010 లో  ఏం మాయచేశావే చిత్రం తో తన ప్రస్థానం ప్రారంబించి మరోచరిత్ర,  గగనం,  180,  ఇంటింటా అన్నమయ్య చిత్రాలకు  మాటలను  అందించిన అనూరాధ,  గౌతమ్ కశ్యప్ ( కావూరి శ్రీధర్ కుమార్ ),  తో కలిసి మాటలు అందించ నున్నారు.  ఉత్తమ మాటల రచయితగా  అక్కినేని-అభినందన ఫౌండేషన్, సూపర్ హిట్ ప్రత్రిక నుంచి, ఇంకా అనేక సంస్థల నుంచి అవార్డ్ లను అందుకున్నారు.       పాటలు : అనంత శ్రీరామ్. ఈ ప్రముఖ పాటల రచయిత సుమారు నలభై చిత్రాలకు పాటలు రాయడమే కాకఎటో వెళ్ళిపోయింది మనసుచిత్రానికి 2012 లో ఉత్తమ పాటల రచయితగా కూడా అవార్డ్ అందుకున్నారు.ఆర్ట్ డైరెక్టర్: ప్రేమ్ నవాజ్ : ఈ ఆర్ట్ డైరెక్టర్,  ప్రముఖ ఆర్ట్ డైరెక్టర్స్ అయిన  సాబూ శిరిల్, సెల్వ ల వద్ద అనుభవం సంపాదించుకున్నారు.
కాస్ట్యూమ్స్ : అనూ పార్థసారధి,స్టిల్స్ : లక్ష్మి కాంతన్,మేకప్ : సలీమ్ నాగర్ కోయిల్,పి. అర్. ఓ.,: బి. ఏ. రాజుఈ చిత్రానికి ఎక్సుక్యూటివ్ ప్రొడ్యూసర్స్ గా బాధ్యతలు నిర్వహిస్తున్న   సురేష్ బాలాజీ, అండ్  జార్జ్ పయస్ లు వైడ్ ఏంగిల్ క్రియేషన్స్ సంస్థ తరపున  కిరీడమ్, యావరుమ్ నలమ్, మధురై సంభవమ్, 180, మరియు  భిల్లా – 2 చిత్రాలకు సేవలు అందించారు.    
నటీనట వర్గం“అలా మొదలైంది..”,  “180”,  “ఇష్క్”,  “జబర్ దస్త్” , “గుండెజారి గల్లంతైంది” చిత్రాలతో  ప్రేక్షక హృదయాలను దోచుకుని, తెలుగు తమిళ మళయాళ చిత్రాల్లో నటిస్తున్న ప్రముఖ హీరోయిన్ నిత్యామీనన్ ఈ చిత్రంలో నటిస్తోంది.
క్రిష్ సత్తార్ ఈ చిత్రంతో హీరోగా ముందుకొస్తున్నారు. ఈ యువ నటుడు, అలనాటి ప్రముఖ మళయాళ చలన చిత్ర హీరోయిన్ శ్రీమతి జయభారతి, ప్రముఖ నటుడు  సత్తార్ ల పుత్రుడు.తన నటనా కౌశలంతో 300 పైగా చలన చిత్రాలతో  ప్రేక్షకులను మెప్పించి ఒప్పించిన కోట శ్రీనివాసరావు ఒక ప్రత్యేక పాత్ర లో కనిపించనున్నారు.
ఇక ప్రముఖ హాస్య నటి కోవై సరళ ఈ చిత్రంతో మళ్లీ ప్రేక్షకులలో  నవ్వుల సంచలనం కలిగించనున్నారు.దర్శక రచయిత జంధ్యాల ద్వారా చిత్ర సీమలో ప్రవేశించి అనేక చలన చిత్రాలలో హీరోగా నటించిన  ’నరేష్’ ఈ చిత్రంలో మళ్లీ ఒక ప్రత్యేక పాత్ర లో కనిపించనున్నారు.విద్యూరామన్  కొత్తగా పరిచయమౌతున్నారు.సూదు కవ్వమ్ చిత్రం ద్వారా పరిచయమైన అంజలిరావ్ ఈ చిత్రంతో తెలుగులో ప్రవేశించనున్నారు.హార్లిక్స్ అంకుల్ ఏ.సి., మురళి,  ధియేటర్ ఆర్టిస్ట్ లైన  జానకి,  చంద్ర లు ఈ చిత్రంలో తమ సత్తా చాటనున్నారు.